అలుపెరుగని బాటసారి

అలుపెరుగని బాటసారి

వేటూరి గారికి నివాళి...



నాకున్న మిడిమిడిజ్ఞానంతో వేటూరి సుందరరామ్మూర్తి గారి గురించి రాయటానికి అనర్హుడిని అని నాకు తెలుసు. కాకపోతే ఇటీవలే శేఖర్ కమ్ముల వేటూరి గారి మీద రాసిన ఒక పద రాజీవమును చదివాక నాలో ఉన్న రచయిత మేల్కొని నన్నే విమర్శిస్తున్న క్షణాలలో చిన్ని ప్రయత్నము చేస్తున్నాను.
వేటూరి గారి పేరు వినగానే నాకు గుర్తొచ్చే మొట్టమొదటి పదం, పాట "యమునా తీరం". ఆయన లంనుండి జాలువారిన ఆణిముత్యాలు అనన్యమైనవి ఉండొచ్చు కాని మా తరానికి వేటూరి గారు శేఖర్ కమ్ముల చిత్రాలకు రాసిన అపురూప కావ్య కల్పనలు మాత్రమే తొలుత గుర్తొస్తాయి. తరం నుండి తరం వరకూ అందరికీ చిరపరిచితులై తెలుగును మరచిపోయి మమ్మీ డాడీ సంస్కృతికి అలవాటు పడిన తెలుగు వారికి తెలుగుదనాన్ని పరిచయం చేసిన మహానుభావుడు మన వేటూరి.
మే 22న ముంబాయి లో ఉన్నప్పుడు ఎందుకనో వార్తలు చూస్తూండగా ఆ మహానుభావుడు కనుమూసిన విషయం తెలిసి కొంచెం బాధగా అనిపించింది. కానీ వేటూరి గారిపై శేఖర్ రాసిన వ్యాఖ్యానం చదవగానే వేటూరి గారితో ప్రత్యక్షంగా ఎటువంటి అనుబంధమూ లేని నాకే కళ్లు చెమర్చాయి. అలాంటిది శేఖర్ కి తన అనుబంధాల గురించి రాస్తున్నప్పుడు హృదయం ద్రవించిపోయిందంటే అతిశయోక్తేమీ కాదు. అంతటి బాధలో తన భావోద్వేగాల్ని ఎంతో అద్భుతంగా మలిచి రచించినందుకు, మనకి తెలుగుదనంలోని కమ్మదనాన్ని రుచి చూపించిన వేటూరి గారికి నివాళిగా అర్పించిన శేఖర్ కి ఇవే నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
నేను NIT Warangal లో ఉన్నప్పుడు ఒకసారి శేఖర్ కమ్ములని కలిసే అవకాశం వచ్చింది. అప్పుడు మాటల్లో ఒకానొక సందర్భంలో శేఖర్ ని తన సినిమాల్లో పాటల గురించి అడిగితే వేటూరి గారి గురించి చెబుతూ అన్నారు, "ఆయన సరస్వతీ పుత్రుడు.. నిజానికి నా సినిమాల్లో పాటలు ఆయన రాయరు. ఆయన కలం మీద కూర్చుని సాక్షాత్ సరస్వతీ దేవే రాస్తుంది.." అని. ఆ మాటల్లో ఎంత నిజం ఉందో వేటూరి గారి మరణ వార్త విన్నప్పుడు సరస్వతీ దేవికి కూడా కంటతడి వచ్చుంటుందని అనుకుంటున్నాను. ఆమె కళ్లనుండి రాలిన ఆ కన్నీటిబొట్లు ఒక్కొక్కటీ ఒక్కో వేటూరిగా మారాలని, తెలుగు చలనచిత్ర రంగంలో తెలుగు భాష అంతరించిపోకుండా ఉండాలని ఆశిస్తూ…
మీ
ఉదయ్ శంకర్ యర్రమిల్లి.





P.S: శేఖర్ రాసిన వ్యాఖ్యానం ఈ క్రింద తెలిపిన లింక్ లో చదవచ్చు.
Share on Google Plus

About ఉదయ్ శంకర్ యర్రమిల్లి

    Blogger Comment
    Facebook Comment

4 comments :

  1. Hrudayanni kadilinchey la chakkaga chepparu.An honest write.Looks as though blogs read better in Telugu.

    రిప్లయితొలగించండి
  2. idea bagundi mastaru. keep it up... keep updating, ee blog tondaralo famous avvalani korukuntunna! - aditya

    రిప్లయితొలగించండి
  3. anandam, vishadam, istam, dvesham ee bhavana ayina sare telugulone baaga cheppagalam anela untundi veturi gari sahityam... aa padalalo mardhavam...sunnithamayina srungaram..nee sogasu chooda tarama anipistayi ayina patalu vintoounte...mahanubhavudu ekkada unna abhimanula manasullo matram nirantaram untaru...telugu pata bratikunannallu maa jnapakallo lo niliche untaru

    రిప్లయితొలగించండి
  4. ఇంకా చాలా చాలా ఆలొచనలు ఉన్నాయి ఈ చిన్ని బుర్రలో.. కాకపోతే సమయం దొరకటమే కష్టంగా ఉంటోంది. 3 నెలల నుండి మొదలుపెట్టాలనుకుంటే ఇప్పటికి కుదిరింది. ఎదేమైనా ఇకమీదట తరచూ రాస్తూ ఉంటా మన తెలుగువారందరికోసం... :)

    @ Seshu: నా నిజాయితీని గుర్తించినందుకు చాలా థాంక్స్.

    @ Aditya: మీ లాంటి అభిమానులు ఉన్నంతవరకూ మా లాంటి వాళ్లు రాస్తూనే ఉండొచ్చు..

    @ Madhavi: వేటూరి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.. మీరన్నట్లు ఆయన పాటలు వింటుంటే "నిజంగా తెలుగు భాష అంటే ఇదా" అని అనిపిస్తుంది.. వేటూరి గారు!! జోహార్... :)

    రిప్లయితొలగించండి