మరి అమ్మ నాకు బో.......లెడన్ని కథలు చెబుతుంది కదా. నాన్నకి కథలు చెప్పడం రాదని అంటాడు కదా. ఈ మధ్యన కొంచెం బాగా చెబుతున్నాడనుకోండి. సరే, అమ్మ నాకు మరి పెప్పా పిగ్, కోకోమెలన్, కుంగ్ఫూ పాండా, బాలూ-సీతా, ఇంకా పంచతంత్ర కథలు, జాతక టేల్స్, ఇంకా బోలెడన్ని కథలు చెబుతుంది తెలుసా.. నాకు కూడా కథలంటే చాల చాలా ఇష్టం మరి. నాకు ఇప్పుడు రామాయణం కూడా చెబుతోంది. నేను కూడా కొన్ని కథలు బాగా గుర్తుంచుకుని భలే చెబుతాను తెలుసా.
నేను చెప్పిన ఒక కథ ఇక్కడ వినండి.
అవును మీకు చెప్పడం మరచిపోయా, నేను ఇప్పుడు నా, నాది, నాకు, నేను, అని అనేస్తున్నాను మరి. ముందైతే చిమ్మయిది, చిమ్మయికి, అని అనేదాన్ని. అంటే ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయా కదా. అదీ సంగతి మరి.
ఇంకా అమ్మ నాకు రోజూ లాల పోసేది. లాల అంటే స్నానం అట. నాన్న చెప్పాడు. నేను రోజూ టూ టైమ్స్ స్నానం చేసేస్తా. ఇప్పుడైతే నాకు రోజూ నాన్నే లాల పోస్తాడు మరి. అంటే అమ్మ కూడా పోస్తుంది. కానీ నేను నాన్నే కావాలి అని అంటానన్నమాట. అదీ సంగతీ. మరి అమ్మ రెస్ట్ తీసుకోవాలి కదా. ఒకసారి అమ్మ వచ్చిందంటే “అమ్మా. నువ్వు హాల్ లోకి వెళ్ళి సోఫాలో కుర్చో” అని అంటాను. ఇంకోసారి “అమ్మా. నువ్వు వెళ్ళు. వెళ్ళి వంట చేసేయ్” అని కూడా అంటాను. హిహ్హిహిహ్హిహ్హీ... అప్పుడు అమ్మ నన్ను “నువ్వే పో సుబ్బమ్మ. నా ఇష్టం. నేనిక్కడ ఉంటా” అని అంటూ ఉంటుంది.
ఇంకా అమ్మ నాకు రోజూ స్కూల్ కి భలే మంచి బాక్స్ లు ఇస్తుంది తెలుసా. దోశ, చపాతీ, పరాఠా, పోహా, ఇంకా.... బ్రాడ్ బీన్సు, మురుకులు, ఇంకా బోలెడన్ని చేసి ఇస్తుంది. మరి నేను రోజూ బాక్స్ ఫుల్లుగా తిననుగా.. ఇంటికొచ్చాకానే ఫ్రెష్ అయిపోయి అప్పుడు తింటా. ఇంకా.. హా.. నాకు ప్యాన్ కేక్స్, ఇడ్లీలు, ఫూల్ మఖానా, రాగి జావ, ఇంకా బోలెడంత ఆం చేసి తినిపిస్తుంది. మరి నేను అప్పుడు కూడా బో....లెడన్ని స్టోరీస్ చెప్పమని అంటే నాకు చాలా స్టోరీస్ చెబుతుంది. మొన్న నాకు డేట్స్ కేక్, ఇంకా శ్రీఖండ్ అన్నీ చేసి పెట్టింది.
ఇంకా నాకు బాగా స్టోరీస్ అన్నీ చెబుతూ జో కొడుతూ బజ్జోపెడుతుంది. ఇంకా నాకు ABCDలు, నెంబర్సు రాయడం నేర్పిస్తుంది. బొమ్మలు గీయిస్తుంది. నాకు బోలెడు బొమ్మలు ఇస్తుంది. నన్ను ఆడిస్తుంది. రాత్రి అయిపోతే బొమ్మలు అన్నీ తీసేసి సర్దేసి నన్ను బజ్జోపెట్టేస్తుంది.
ఆ.. ఇంకో విషయం ఏమిటంటే అమ్మ ఇప్పుడు టీచర్ కూడా అయిపోయింది తెలుసా. ఫ్రెంచ్ చెబుతుంది. ఎప్పుడూ నన్ను ఆడుకోనీయకుండా నా iPad తీసేసుకుంటుంది. నేను అడిగితే "నాకు
క్లాస్ ఉంది కదా చిన్నమ్మా. నన్ను డిస్టర్బ్ చెయ్యకూడదు." అని అంటుంది. నాన్న కూడా అమ్మకే సపోర్ట్. అందుకే నాకు కోపం వచ్చి నేను కూడా టీచర్ అయిపోయా.. నా స్టూడెంట్స్ ఎవరో తెలుసా? మామ నా ఫస్ట్ స్టూడెంట్. ఇంకా అత్త, గోపి తాత, అమ్మమ్మ, బామ్మ, ఇలా నాకు కూడా బోలెడు మంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను వాళ్ళందరికీ ABCDలు, నెంబర్స్, ఇంకా రైమ్స్, పద్యాలు, అన్నీ నేర్పిస్తాను.
అయినా అమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అమ్మ అండ్ చిన్మయి కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ అమ్మా అండ్ హ్యాపీ మదర్స్ డే. ఆల్ ది బెస్ట్.
ఓకే బై. మీ అందరినీ మళ్ళీ కలుస్తా. సీ యూ. టేక్ కేర్.
0 comments :
కామెంట్‌ను పోస్ట్ చేయండి