సుమతీ శతకం ఒక నీతి శతకం.
సుమతీ శతక కర్త బద్దెన కవి. ఈయన 13వ శతాబ్దానికి (1220 - 1280) చెందిన వాడు. ఈయన పేరు భద్ర భూపాలుడు అని, ఈయన తిక్కన కవికి శిష్యుడని కూడా ప్రాచుర్యంలో ఉంది.
తెలుగులో రచించిన శతకాల్లో పాల్కురికి సోమనాధుడు రచించిన వృషాధిప శతకం, యథావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకం, బద్దెన రచించిన సుమతీ శతకం ప్రప్రధమమైనవిగా పేర్కొంటారు. పరభాషలలోకి అనువదించబడిన మొట్టమొదటి తెలుగు రచనలలో కూడా ఈ సుమతీ శతకానికి స్థానం ఉండటం విశేషం.
ఈ శతకం ఎంతో సరళమైన భాషలో రచించినందువలన ఎంతో మంది తమ తమ పిల్లలకు తొలినాళ్లలోనే మంచి చెడులు బోధించడానికి ఉపయోగిస్తారు. పాఠశాలల్లో కూడా విద్యార్థులకు బోధించే నీతి శతకాల్లో ఈ సుమతీ శతకానికి ఒక సుస్థిర స్థానం ఉన్నదంటే అతిశయోక్తి కాదు.
ఈ పద్యాల చందస్సు కందం.
0 comments :
కామెంట్‌ను పోస్ట్ చేయండి