తేనె కన్నా తీయనిది తెలుగు భాష అని నానుడి. అటువంటి తెలుగు భాషకు ప్రాముఖ్యం తెచ్చిపెట్టి, తెలుగు భాషా ప్రచారం చేయటంలో ముందుగా మన నాటికలు ఉంటే, మెల్లగా ఆ స్థానాన్ని చలనచిత్రాలు తీసుకున్నాయి. నాటి చిత్రాలు తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి పట్టుకొమ్మలుగా నిలిచాయి. అలనాటి మన కవులు, రచయితలు, తమతమ పాటల ద్వారా తెలుగు భాషకు పెద్దపీట వేశారు. మనిషి మనసును ఆహ్లాదపరిచేది సంగీతమైతే, ఉత్తేజపరిచేది సాహిత్యం. చక్కని సాహిత్యానికి చిక్కని సంగీతం తోడయితే, ఆ కలయికనుండి జన్మించే గీతం మధురం, సుమధురం, అద్వితీయం. ఒక పాటకి సాహిత్యం వస్త్రం లాంటిదైతే సంగీతం ఆభరణం లాంటిది.
సంగీత సమ్మోహనాలైన నాటి పాటలనుండీ సాహితీమాధుర్యం జాలువారేది. "చిటపట చినుకులు పడుతూ ఉంటే", "ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది", లాంటి పాటలు ఇన్ని దశాబ్దాలు గడిచినా, అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయనడం అతిశయోక్తి కాదు. ఆఖరికి నాటి ఐటమ్ సాంగ్స్ కూడా సాహిత్యపరంగా బాగానే ఉండేవి. ఎన్టీఆర్, ఏయన్నార్ లాంటి కథానాయకులు కాని, సావిత్రి, భానుమతి లాంటి కథానాయికలు కాని, ఆత్రేయ, ఆరుద్ర, సినారె, వేటూరి, సిరివెన్నెల లాంటి గీత రచయితలు కాని, దర్శకులు, నిర్మాతలు కాని, భాషకు ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారు.
అటువంటి తెలుగు గీతాలు నేడు వివస్త్రులయ్యాయి. తెలుగు మీద మంచి పట్టు ఉన్న రచయితలు తక్కువయిన నేటి సినీ ప్రపంచం సాహిత్యానికి అంత్యక్రియలు జరుపుతుంటే తెలుగుదనం కోరుకునే దర్శకులు నిర్మాతలు కరువయ్యి ఆ దహనాగ్నికి ఆజ్యం పోస్తున్నారు. రాను రాను, ట్రెండు, బెండు, దాని గుండు అంటూ ఒళ్ళు మండేలా మారిపోయాయి మన రచనలు.
సాహిత్యరహితమైన నేటి సినీప్రపంచంలో తళుక్కుమనే సాహిత్యసహితమైన రచయితల్లో చంద్రబోస్ ఒకరు. వేటూరిగారి తర్వాత మళ్ళీ నేటి తరంలో సాహిత్యానికి ప్రాధాన్యతనిస్తూ గేయ రచన చేస్తున్నవాళ్లల్లో చంద్రబోస్ ఒకరు.
ఈ మధ్యన గబ్బర్ సింగ్ చిత్రానికి అతను రాసిన ఒక పాట నన్నెంతగానో ఆకట్టుకుంది. ఒక అమ్మాయిని మనస్పూర్తిగా కోరుకునే ఒక అబ్బాయి "నిన్ను నేను ఇష్టపడుతున్నాను. మనిద్దరి కలయిక ఎంతో బాగుంటుంది. ఒకవైపు నా మీద దయ చూపిస్తున్నట్లే ఉంటూ నన్నెందుకు ఇలా వేధిస్తున్నావు?" అంటూ అడగాలనుకునే సన్నివేశం కోసం రచించిన పాట ఇది.
అమ్మాయిని ఆకాశంతో పోల్చి, తనని తాను ఆనందం చేసే అల్లరితో పోల్చుకుంటూ మొదలుపెట్టిన ప్రయోగం అమోఘం.
తమ కలయిక బాగుంటుందని చెప్పడానికి 'వానల్లే నువ్వు జారగా, నేలల్లే నేను మారగా, వాగల్లే నువ్వు నేను చేరగా అది వరదై పొంగి సాగరమౌతుందే' అని ఆ కలయికను పోల్చిన తీరు అద్భుతం.
సుగుణాలున్న రాక్షసి, శత్రువులాంటి ప్రేయసి.. వ్యతిరేకతలో కూడా ఇంత అందంగా పొగడ్తను నింపిన తీరు...
దేవత లాంటి రూపమున్న ఆ అమ్మాయిని "దేవతంటి రూపసి" అనటం...
నిద్దురపుచ్చుతున్న గాలుల్లోని రాగాలు, నిద్దుర లేపుతున్న లోకంలోని అందాలు, ఇవన్నీ ఆ అమ్మాయిలో చూసుకునే ఆ అబ్బాయి...
తనను నిద్దురపుచ్చుతున్న గాలుల్లోని రాగాలు, తనను నిద్దుర లేపుతున్న లోకంలోని అందాలు,
తనకు ప్రాణం పోస్తున్న స్వర్గంలోని సుఖాలు, తన ప్రాణం కోస్తున్న నరకంలో హింసలు,
ఇలా ఎన్ని వర్ణనలో...
చంద్రబోస్ కలం, శంకర్ మహదేవన్ గళం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, వీటన్నింటి సమ్మేళనం, ఈ చక్కని గీతం.
ఈ పాట పూర్తి సాహిత్యం మీ కోసం...
------------------------------------------------------------------------------------------------------------తమ కలయిక బాగుంటుందని చెప్పడానికి 'వానల్లే నువ్వు జారగా, నేలల్లే నేను మారగా, వాగల్లే నువ్వు నేను చేరగా అది వరదై పొంగి సాగరమౌతుందే' అని ఆ కలయికను పోల్చిన తీరు అద్భుతం.
సుగుణాలున్న రాక్షసి, శత్రువులాంటి ప్రేయసి.. వ్యతిరేకతలో కూడా ఇంత అందంగా పొగడ్తను నింపిన తీరు...
దేవత లాంటి రూపమున్న ఆ అమ్మాయిని "దేవతంటి రూపసి" అనటం...
నిద్దురపుచ్చుతున్న గాలుల్లోని రాగాలు, నిద్దుర లేపుతున్న లోకంలోని అందాలు, ఇవన్నీ ఆ అమ్మాయిలో చూసుకునే ఆ అబ్బాయి...
తనను నిద్దురపుచ్చుతున్న గాలుల్లోని రాగాలు, తనను నిద్దుర లేపుతున్న లోకంలోని అందాలు,
తనకు ప్రాణం పోస్తున్న స్వర్గంలోని సుఖాలు, తన ప్రాణం కోస్తున్న నరకంలో హింసలు,
ఇలా ఎన్ని వర్ణనలో...
చంద్రబోస్ కలం, శంకర్ మహదేవన్ గళం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, వీటన్నింటి సమ్మేళనం, ఈ చక్కని గీతం.
ఈ పాట పూర్తి సాహిత్యం మీ కోసం...
సాకీ:
ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసును మీటిన కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇది తీయని ప్రేమకు తయ్యారం
పల్లవి:
ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే
ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే
వానల్లే నువ్వు జారగా, నేలల్లే నేను మారగా
వాగల్లే నువ్వు నేను చేరగా అది వరదై పొంగి సాగరమౌతుందే
హోలా. హోలా... హోలా. హోలా... నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్లా
హోలా. హోలా... హోలా. హోలా... ఇక చాలా చాలా జరిగే నీవల్లా
చరణం 1:
అల్లేసి, నను గిల్లేసి, తెగ నవ్వినావే సుగుణాల రాక్షసి, శత్రువంటి ప్రేయసి
పట్టేసి, కనికట్టేసి, దడ పెంచినావే దయ లేని ఊర్వశి, దేవతంటి రూపసి
గాలుల్లో రాగాలన్నీనీలో పలికేనే, నిద్దురపుచ్చెనే
హో.. లోకంలో అందాలన్నీ నీలో చేరెనే, నిద్దురలేపెనే.. || హోలా. హోలా... ||
చరణం 2:
వచ్చేసి, మది గిచ్చేసి, మసి చేసినావే, ఋషిలాంటి నా రుచి, మార్చినావే అభిరుచి
సిగ్గేసి, చలి మొగ్గేసి, ఉసిగొలిపినావే సరిగమల పద నిశీ, చేర్చినావె రోదసి
స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగెనే, ప్రాణం పోసెనే
నరకంలో నానా హింసలు నీలో సొగసేనే, ప్రాణం కోసెనే.. || హోలా. హోలా... ||
------------------------------------------------------------------------------------------------------------
0 comments :
కామెంట్‌ను పోస్ట్ చేయండి