నేను ఒక అలుపెరుగని బాటసారిని. నన్ను నేను ఆత్మ పరిశోధన చేసుకునే ఈ ప్రయాణంలో నా గురించి, నేను కలిసిన వ్యక్తుల గురించి, నన్ను ప్రభావితం చేసిన సంఘటనలు, ఆలోచనలు, చలనచిత్రాలు, తదితరుల గురించి నా భావాలు, ఆలోచనలు పంచుకునే వేదికగా ఈ బ్లాగును ప్రారంభించాను.
నేను స్వతహాగా తెలుగు భాషాభిమానిని. తర్కం, విఙ్ఞాన శాస్త్రాలు, క్రీడలు, పుస్తక పఠనం, సంగీతం, సాహిత్యం, ప్రాచీన సాంప్రదాయాలని మరియు మన వేదాలని పురాణాలని అభ్యసించడం వంటివాటి మీద ఎంతో ఆసక్తితో వాటికి సంబంధించి నేను నా అభిప్రాయాలను పంచుకోవడానికి కూడా ఈ బ్లాగును వేదికగా ఉపయోగించుకుంటున్నాను.
నా గురించి వ్రాసుకునేంత నేనింకా ఏమీ సాధించలేదని నా అభిప్రాయం. సాధించినప్పుడు ఖచ్చితంగా నన్ను నేను మరింత వివరంగా పరిచయం చేసుకుంటాను. నా ఈ బ్లాగు మీకందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ విలువైన సలహాలతో ఈ బ్లాగును, నా రచనాశైలిని మెరుగుపరుచుకోవడానికి తోడ్పడుతారని ఆశిస్తున్నాను.
మీ
ఉదయ శంకర్ యర్రమిల్లి
0 comments :
కామెంట్‌ను పోస్ట్ చేయండి