హాయ్! నా పేరు చిమ్మయి. మా నాన్న పేరు ఉదయ్. నాన్న తెలుగులో బ్లాగు రాసి చా....లా.... రోజులయ్యింది సో ఈ నా పస్తానం రాద్దామని ఫిస్సయారత. సో ఇక మరి నేనేమో మరేమో మిమ్మల్ని తరచూ పలకరిస్తూ ఉంతానన్నమాత..
————————————————————————————————————————-
చెప్పా కదా.. నా పేరు చిమ్మయి. నాకిప్పుదు వన్.. తూ... తూ ఇయస్ కదా. మరి చిమ్మయి ఇంకా లితిల్ గల్ కదా. పేరు సరిగా పలకతం రాదు. చిమ్మయిని గోపీ తాత వాసవమ్మ అని పిలుస్తారు. నేను మరి అన్నీ చిమ్మయి చేసింది, చిమ్మయి తింది, చిమ్మయికి కాలుకి ఆయొచ్చింది, చిమ్మయికి ఫోన్ కావాలి, ఇలానే మాతాత్తాను. మరి నా పేరు చాల చాలా పెద్దది కదా, మరి అందరూ ఇంకో ఇంకో పేరుతో పిలుస్తారు. మా అమ్మమ్మ పేరు రత్.నా.. నన్ను చిన్నుగాదూ అని పిలుస్తుంది. బామ్మ పందూ అంతుంది. బామ్మ పేరు ఉష. నా పేరులో కూడా ఉష ఉందిగా.. మరి మూత్తి తాత చిమ్మయిని పందుగాదూ అంతారు. నాన్న నాకు బామ్మ తాత, అమ్మమ్మ తాత అని నేప్పించాదు. బామ్మ తాత పేరు మూత్తీ తాత, అమ్మమ్మ తాత పేరు గోపీ తాత.
మామ పేరు కాతీక్ మామ. హాంకాంగ్ లో ఉంతాదు. మామ ఎలా తుమ్ముతాడో చిమ్మయికి చాల బాగా తెలుసు. ఇహ్హిహ్హిహ్హీ... తాత ఎలా దగ్గుతారో కూడా తెలుసు. అశ్శిని అత్త చిమ్మయికి చాలా ఇష్టం. అత్తకి కూదా చిమ్మయంతే చాలా ఇష్టం. దొల్లు పుచ్చకాయ్ అంతుంది. వంషీ బాబాయ్ చెన్నైలో ఉంతాదు. పిన్ని పేరు శాయా. చిన్నమ్మా అంతుంది.
నాన్న అండ్ చిమ్మయు ఆర్ బెష్త్ ఫెండ్స్. మరి అందుకే ఏమో నాన్న నన్ను చాలా పేర్లు పిలుస్తాదు. చిన్నమ్మా, బుజ్జమ్మా, చిమ్మయీ, బుజ్జి పందూ, చిన్ని పందూ, బుడ్డీ, బుడ్డీ ఫెలో, గుండూ ఫెలో, ఇంకా చాలా చాలా పేర్లు పిలుస్తారు. మరి చిన్న పిల్లని కదా, ఎలా పిలిచినా సరే, నాన్నా అంతూ చిమ్మయి పరిగెత్తుకు వెల్తుంది. అయినా, నాన్న నా బెస్ట్ ఫెండ్ కదా, ఎలా పిలిచినా ఓ..కే..
చిమ్మయి మాత్రం నాన్నని నాన్నా... అని, అమ్మని అమ్మా అని పిలుస్తుంది. మరి నాన్న అప్పప్పుదూ అమ్మని కాయా... అని పిలవమంతాదు. అప్పుదు చిమ్మయి గత్తిగా కాయా అనీ, అప్పప్పుదూ కా..వ్యా.. అనీ అరుస్.తుంది. అమ్మ కళ్లు ఇలా చేసి చూస్తుంది మరి. ఇలా అంటే అలా అని. కానీ చిమ్మయికి బయం లేదుగా, పళ్లుతో నవ్వేసి పరిగెత్తేత్తుంది..
టైం ఎంతయింది? తెలీదు. అమ్మ ఆం చేస్తోంది. మరి నాన్న ఇంకా ఆచ్చెళ్లి రాలేదు. అంటే నాన్న రోజూ ఓఫీస్ కి వెళ్తాదు కదా. అమ్మ చిమ్మయికి ఆం తింపిస్సుంది. తవ్వాత బజ్జుకుంటుంది. .
చిమ్మయి ఈజే వెరీ గుగ్గల్.. నాన్న ఇది పాట నేపించాదు. చిమ్మయికి మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం.
ఓకే బాయ్... సీ యూ... గున్నైట్.. తేకేర్.. ఆ ద బెస్త్...
0 comments :
కామెంట్‌ను పోస్ట్ చేయండి