హాయ్! నేనోచ్ఛేశా…
మీకో విషయం తెలుసా.. నాకు తెయిన్ అంతే ఎంత ఇష్టమో.. మెత్రో తెయిన్, మోనో రైల్ తెయిన్, మాములు తెయిన్, ఇలా బోలెడన్ని తెయిన్స్ నా వెహికల్స్ బుక్కులో ఉన్నాయి. అవన్నీ మరి అమ్మ చిమ్మయికి నేప్పించింది. చిమ్మయి కూడా చాలా ఫాస్ట్ గా నేచేసుకుందిలే. చిమ్మయికి తెయిన్ అంటే ఎంత ఇష్టమో అని అత్త, అమ్మ హైదరాబాద్ లో మెత్రో తెయిన్ ఎక్కించారు. ఇంకా ఆ రోజు నుండి మెత్రో తెయిన్.. మోనో తెయిన్... మెత్రో తెయిన్.. మోనో తెయిన్... మెత్రో తెయిన్.. మోనో తెయిన్... అని ఎన్ని సార్లు అనాలో అన్ని సార్లు అంది చిమ్మయి.
అది చూసి నాన్న మొన్న ఒక సండే రోజు, అంటే మొన్న అంటే మొన్న అనే కాదు, ఎప్పుడో, ఒక పది ముప్పై యాభై రోజుల ముందు అన్నమాట, నన్ను మోనో రెయిల్ ఎక్కిస్తా అన్నాడు. మరి మెత్రో తెయిన్ మోనో రైల్ రెండూ పూణేలో లేవు కదా అందుకే ముంబై తీసుకెళ్లారు. అబ్బో!! అసలు ముంబై వెళ్లే దారి ఎంత బాగుందో..చాలా చాలా బాగుంది. నాన్న చిమ్మాయిని కారులో తీస్కెళ్ళారు. అది పేద్ద బ్లూ కార్. అందులో చాలా చాలా ఫాస్త్ గా తీసుకెళ్లారు. దారిలో అంటా ఎన్ని కార్లో, బోలెడన్ని కార్లు - వైత్ కార్స్, బూ కార్స్, రెడ్ కార్స్, ఎల్లో కార్స్, ఇంకా ఎన్ని కలస్సో.చిన్న కార్స్, పెద్ద కార్స్, ఇలా ఎన్ని రకాలో. చిమ్మయికి చాలా బాగా నచ్చేశాయి.
ఇంకా ఆ దారిలో ఎన్ని కొండలో.. అంతా మొత్తం గీన్ గీన్ కొండలు. మా ఇంట్లో బాల్కనీలో కూడా బోలేడు కొండలు కంపిస్తాయి. అమ్మ నాన్న రోజు చిమ్మయికి కొండలు చూపిస్తారు బాల్కనీ లో. ఇంకా ముంబై దారిలో ఎన్నో టనెల్స్ కూడా ఉన్నాయి. టనెల్స్ అంటే ఏంటో చిమ్మయికి తెలీదు. అమ్మ చెప్పింది టనెల్స్ అని అంటారు అని. అయితే అందులో అంతా బ్లాక్ గా చీకటిగా ఉంది. అయినా సరే చిమ్మయికి అస్సలు బయం రాలేదు. ఇంక చిమ్మయికి కొంచెం సేపు అవ్వగానే నిదర ఒచ్చేసి బజ్జు౦డిపోయింది.
ఇంక సరే, ముంబై రాగానే అమ్మ నిదర లేపేసింది. నాన్న ఒక పెద్ద బిల్డింగ్ కింద కార్ పార్కింగ్ చేశారు. అది మాల్ అంటారట. నాన్నే చెప్పాడు. అక్కన్నుంచి మోనో రైల్ స్టేషన్ కి నాన్న తీస్కెళ్ళారు. అక్కడ అమ్మ, నాన్న, చిమ్మయి, ముగ్గురూ మోనో రైల్ ఎక్కేశారు.
అమ్మ ఒక సీట్లో కూచుంది. చిమ్మయి పక్కనే ఉన్న సీట్లో నించుంది. నాన్నకి సీట్ దొరకలేదని నాన్న నించున్నాడు. చిమ్మయికి మోనో రైల్ ఎంతో నచ్చేసింది. అసలు తేయిన్ వెళుతుంటే చిమ్మయికి ఎన్ని ఎక్స్ పేషన్సో... ఎక్స్ పేషన్స్ అంటే ఏంటో మరి చిమ్మయికి కూడా తెలీదు. ఎక్స్ పేషన్స్ అంటే ఎక్స్పెషన్స్ అనే అర్థం అట. ఇది ఎవ్వరూ చెప్పలేదు, చిమ్మాయినే చెప్పింది. అంటే మొహం అలా పెట్టి చూడటం అన్నమాట. అలా అంటే అలా అని. మరి చిమ్మయి ఇప్పుడు పెద్ద పిల్ల కదా, అంటే మరీ పెద్ద కూడా కాదు, మరీ చిన్న కూడా కాదు, పెద్ద అంటే పెద్ద, అంతే. సో అన్నీ అలా తెలిసిపోతాయి. అంతే.
అలా చాలా చాలా సేపు తేయిన్ లో వెళ్లి మళ్ళీ వెనక్కి మాల్ కి వచ్చేశాము. మాల్ లో ఇంకో చిన్న పాండా తెయిన్ చూసి ఎక్కాలనిపించిందని నాన్న నన్ను, అమ్మని ఎక్కించాడు పాండా తెయిన్ లో. భలే భలేగా ఉందనుకోండి అది. అందులో వన్ - త్రీ - సిక్స్ రౌండ్స్ తిరిగి ఇంక మేము మళ్ళీ కార్ లో పూణే వచ్చేశాం.
అంతే. టాటా. బాయ్. అల్ ది బెస్ట్. సీ యూ మళ్ళీ. మీరు కూడా అందరూ మోనో రైల్ ఎక్కండి. మర్చిపోద్దు. బాయ్ బాయ్.
0 comments :
కామెంట్‌ను పోస్ట్ చేయండి