హాయ్. నేను మళ్ళీ వచ్చేశా. ఈ సారి క్యాపితల్స్ గురించి మాట్లాడుకుందాం. క్యాపితల్స్ అంటే ఏంటో అని అనుకోకండి. క్యాపితల్స్ అంటే రాజధానులు. అంటే ఏంటో నాకు కూడా తెలీదు. అమ్మ చెప్పింది అంతే. మీకో విషయం తెలుసా? నాకు మన కంటిరీలో ఉన్న స్టేట్స్ అన్నింటికీ క్యాపితల్స్ తెలుసు తెలుసా?
ఫస్ట్ నాకు అమ్మ మన కంటిరీ పేరు ఇండియా అని, మన కంటిరీ కాపితల్ పేరు న్యూ ఢిల్లీ అని చెప్పింది. ఇంకా మన స్టేట్ మహారాష్ట్ర అని దాని కాపితల్ పేరు ముంబై అని చెప్పింది. అంటే మరి నేను పూనేలో ఉంటా కదా, అందుకే మా స్టేట్ పేరు మహారాష్ట్ర. అలా స్టాట్ అయ్యి తిరిగి తిరిగి ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ క్యాపితల్స్ తెలిసే వరకు నడిచింది. ఇప్పుడు నాకు అన్నీ తెలుసు. ఇంకా బోలెడు కంటిరీస్ క్యాపితల్స్ కూడా తెలుసు తెలుసా.
మా బాబాయ్ మాత్రం నన్ను ఎప్పుడూ నాగాలాండ్ కాపితల్ ఏంటి అని అడుగుతాడు. నేను కోషిమా అని చెప్తాను. మరి కోహిమా అనడం నాకు సరిగ్గా రాదు కదా. ఎందుకంటే నేనింకా చిన్న పాపని కదా మరి. అయినా సరే నాకు సరిగ్గా అనడం తెలీదని బాబాయ్ ఎప్పుడూ అదే అడుగుతాడు. నేను కోషిమా అని చెప్పిన వెంటనే గట్టిగా ఒక స్మైల్ ఇస్తాడు. ఇంక నేను అన్నిటికంటే లాస్ట్ నేర్చుకున్న స్టేట్ కాపితల్ కేరళాది. తీరు..అ..అంతపురం అని చెప్పేదాన్ని.
తర్వాత చండీగఢ్ కి నాన్న ఫస్ట్ పంజాబ్ కాపితల్ అని చెప్పారు. తర్వాత హర్యానా కాపితల్ కూడా చండీగఢ్ అని చెప్తే నేను అస్సలు ఒప్పుకోలేదు. ఒకే కాపితల్ రెండు స్టేట్స్ కి ఎలా ఉంటుంది చెప్పండి. అది నా తప్పు కాదు. అలా పెట్టిన వాళ్ళ తప్పు. అందుకే హర్యానా కాపితల్ ఏంటి అని ఎప్పుడూ అడిగినా సరే "చండీగఢ్ కాదు" అని చెప్పేదాన్ని.. హీహ్హీహ్హి.. ఇప్పుడు రెండూ చండీగఢ్ అనే చెప్తా అనుకోండి.
ఇంకా మణిపూర్ కి కాపితల్ ఏంటి అని నాన్న అడిగితే నాన్నకి చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఠక్కున "మణి అమ్మమ్మ" అని చెప్పేసేదాన్ని. అంతే కదా మరి. మా మణి అమ్మమ్మ పేరు మీదే ఆ స్టేట్ కి మణిపూర్ అని పేరు పెట్టారు. ఇది నాకు ఎవ్వరూ చెప్పలేదు. నేనే కనుక్కున్నా. మరి నేను చాలా ఇంటెలిజెంట్ గర్ల్ ని కదా... హహ్హహ్హహ్హ... నేను అలా చెప్పినప్పుడు అమ్మ నాన్న ఫేస్ లో ఎక్స్పెషన్స్ చూడాలి అసలు, ఎక్స్పెషన్సే ఎక్స్పెషన్స్. ఇప్పుడైతే మణిపూర్ కి ఇంఫాల్ అనే చెప్తానులే..
Chinmayee - States Capitals
ఇంకా ఇండియాలో అన్ని స్టేట్స్ అయిపోయాక నాన్న అమ్మ కంట్రీస్ కి క్యాపితల్స్ నేర్పించడం స్టార్ట్ చేసారు. ఫస్ట్ పక్క దేశం పాకిస్తాన్ కాపితల్ అంటే ఇషామాబాద్ అని చెప్పేశా నేను. తర్వాత శ్రీలంక, బాంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గనిస్తాన్ అన్ని నేర్పించి యూ.ఎస్.ఏ. అండ్ యూ.కె. క్యాపితల్స్ నేర్పించారు. నేను యూ.కె. కాపితల్ అంటే లండన్ అని చెప్పి వెంటనే లండన్ బ్రిడ్జి ఇస్ ఫాలింగ్ డౌన్ పాత పాడేస్తాను. నాకెంత ఇష్టమో ఆ పాట అంటే. ఇంకా బేబీ షార్క్ అంటే కూడా చాలా చాలా ఇష్టమనుకోండి.
సరే. ఇంకా ఆ తర్వాత చాలా చాలా కంట్రీస్ కి క్యాపితల్స్ నేర్పించారు అమ్మ నాన్న. కొన్ని క్యాపితల్స్ అయితే చిమ్మయే నేచేసుకుంది. ఎలా అంటే ఎలానే, నాకూ తెలీదు. ఇంకా కెనడా కాపితల్ ఒట్టావా అని చెప్పారు నాన్న. నేనైతే ఎప్పుడూ కెనడా కి కేరళ కి కన్ఫ్యుజ్ అయిపోయి కెనడాకి తిరువనంతపురం అని చెప్పేస్తా. నాన్నైతే గట్టిగా కె.న.డా. అని అడిగితే అప్పుడు సరిగ్గా ఒట్టావా అని చెప్తా. ఇప్పుడైతే ఏకంగా ఒక ట్వంటీ థర్టీత్రీ ఫార్టీ కంట్రీస్ కి క్యాపితల్స్ చెప్పేస్తానుగా...
Chinmayee - Countries Capitals
ఓకే ఇంక చాలు సరేనా. అందరికీ ఇది చదువుతున్నందుకు చాలా చాలా థాంక్ యు. మళ్ళీ ఇంకా బోలెడన్ని విషయాలు మీకు చెప్తాలెండి. ఓకే, సీ యు, బాయ్, అల్ ది బెస్ట్.
0 comments :
కామెంట్‌ను పోస్ట్ చేయండి